సమైక్యంపై రాజీలేదు అని రాష్ట్రంలో కుస్తీలు చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో డీలా పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమైక్యవాణి మరిచి హైదరాబాద్‌పైనే పీటముడి వేసుకొని కూర్చొవడంపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్ ఎవరి కోసం అని ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్, ఆ పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి పెంచాలని ఉద్యమ రంగంలోకి దిగిన ఏపీఎన్‌జీఓలు ఆమోమయానికి గురవుతున్నారు. 44 రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్నా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీనిని చిన్నచూపుగా చూస్తోందని ఏపీఎన్‌జీఓలు, సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాసా, ప్రజలు మండిపడుతున్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక్కరే మార్చగలరని, ఆయనపై ఒత్తిడి పెంచాలని సీమాంధ్ర విద్యార్థి సంఘాల ఐక్యకార్యచరణ కమిటి సమాలోచనలు చేస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరుపై మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రుల వైఖరిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులకు విద్య, ఉద్యోగ, ఉపాధిలో అన్యాయం జరగడంతోపాటు జల వివాదాలు తలెత్తుతాయని, అందుకే రాష్ట్రాన్ని ఐక్యంగాఉంచాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రుల తీరు ఉందని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిఎన్‌జిఓల ఉద్యమానికి తెలంగాణ వాదుల గట్టిమద్దతు లభించిన తరహాలో తమకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నుంచి లభించడంలేదని ఏపీఎన్‌జీఓలు మండిపడుతున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత తీవ్రం గా సాగుతున్నా .. వాస్తవ పరిస్థితిని సైతం పార్టీ హై కమాండ్‌కు వివరించలేని దుస్థితిలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నారని మండిపడుతు న్నారు. పదవులకోసం వారంతా సోనియా ముందు సాగి లా పడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని చెప్పిన ఈ నేతలు తమ పదవులతో పార్టీ హైకమాండ్‌పై తెచ్చిన ఒత్తిడి ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. 44 రోజులపాటు ఏకధాటిగా సీ మాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్నా కాంగ్రెస్‌పార్టీ హైకమాండ్, కేంద్ర ప్రభుత్వం కనీసంగా దాని గురించి పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నదని వారు విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడం మరిచి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాం తం(యూటి)గా చేయాలన్న డిమాండ్‌ను సీమాంధ్ర కాం గ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు చేయడం అర్థరహితమని చెబుతున్నారు.
No comments:
Post a Comment