September 13, 2013

సోనియా అడుగులు ఎటువైపు


న్యూఢిల్లీ: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన సోనియా గాంధి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రక్రియను వేగిరపరుస్తుందా? ఉవ్వెత్తున ఎగిసిన సీమాంధ్ర ఉద్యమాన్ని ప్రాతిపదికగా తీసుకుని విభజన విషయంలో తాత్సారం చేస్తుందా? ఇరు ప్రాంతాల వాదనను పరిగణనలోకి తీసుకునే క్రమంలో విభజను సాధారణ ఎన్నికల నాటికి సాగదీసే దిశగా అడుగులు వేస్తుందా? మారిన తాజా పరిణామాలతో పార్టీ అధినేత్రి అంతరంగం ఏమిటో అర్థంకాక తెలుగు ప్రజానీకం ఉత్కంఠకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధానమంత్రి నివాసంలో జరుగనున్న కోర్‌ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవైపు ముందు నిర్దేశించుకున్నట్టుగా రాష్ట్ర విభజన గడువు ముంచుకు వస్తోంది. 

No comments:

Post a Comment