August 31, 2013

కోల్ కతాలో బాంబు పేలుడు

కోల్ కతాలోని చాందినీ చౌక్ వద్ద శుక్రవారం బాంబు పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ధానిక ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. నిరంతరం జనంతో బిజీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందారు. పేలుడు సమాచార మందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు టిఫిన్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సిసి కెమెరాల ఫుటేజిని పరిశీలించే ప్రయత్నంచేస్తున్నారు.

No comments:

Post a Comment