February 20, 2013

Breaking news


 హైదరాబాద్: విద్యార్ధులు వార్షిక పరీక్షలు ఎలా సిద్దమవ్వాలి. మానసికంగా విద్యార్ధులుఎలాగ దైర్యాన్ని పెంపొందించుకోవాలి అనే అశంపై ఒక డీవీడీని తయారుచేసినట్లు ప్రముఖ చేతిరాత నిపుణులు మల్లికార్జున్ హైదరాబాద్ల లో తెలిపారు. ఈ డీవీడీని ఈనెల 22 ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేస్తామని   చెప్పారు.

కడప: కడప జిల్లా డీసీసీబీ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదా వేసారు.

కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..
ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ బేటీ అయింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలతో పాటు కుంభకోణం,రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజీ కురియన్ పై విపక్షాల విమర్శలు తదితదర అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.


ఊరట..
వంట గ్యాస్ కు ఆధార్ కార్డు అనుసందానంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఒక ప్రకటన చేసారు ఆధార్ కార్డ్ కు బదులుగా గుర్తింపు కార్డ్ ఉంటే చాలని మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె వల్ల బ్యాంకింగ్,రవాణ  సేవలు నిలిచిపోయాయి.  

 బంద్..
హైదరాబాద్ : డిమాండ్ల సాధన కోసం దేశంలో 11 కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో కార్మికులు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. ఉద్యోగస్తులు విధ్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు.


హైదరాబాద్: సడక్ ను విజయ వంతం చేసి తీరుతామని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు. సడక్ కు మద్దతుగా బస్సు యాత్ర ప్రారంభమైంది.
 

గుంటూరు : జిల్లాలో.. మీకోసం పాదయాత్ర కొనసాగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని బాలకృష్ణ పరామర్శించారు.

No comments:

Post a Comment