February 19, 2013

Breaking news


మావోయిస్ట్ కాల్పులు..
విశాఖ : మావోయిస్టులకు గిరిజనులకు  మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు మృతి చెందారు. విశాఖ జిల్లా లక్కవరం-సాగుల మద్య మావోయిస్టులు గిరిజన  సమావేశం నిర్వహించారు.

కరీంనగర్ : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను అన్ని విదాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కూమర్ రెడ్డి హామి ఇచ్చారు.

అర్ధంతరంగా ముగిసిస సదస్సు.. విద్యుత్ చార్జీల పెంపు  ప్రదతిపాదనలపై నిర్వహించిన సభ రసాభసాగా ముగిసింది.విద్యుత్ చార్జీల పెంప ప్రతిపాదనలనుఉపసంహరించులకోవాలని వేదిక ఎదుట బైటయింపు.రాఘవులు వామపక్ష నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తిన ప్రజా సంఘాలు
 

 ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ
విజయవాడ:2013-14 ఏడాదికి విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై విజయవాడలో బహిరంగ విచారణకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు,తెదేపా నేత దేవినేని ఉమ తదితరులు హజరయ్యారు.


అదిలాబాద్: వివాదస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఈ రోజు నిర్మల్ కోర్టుకు హజరయ్యారు.కోర్టు ఈకేసును మార్చి 5కు వాయిదా వేసింది.
హత్య..
విశాఖ : విశాఖలోని రెడ్డి కంచెరపాలంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యారు.  నాలుగు రోజుల క్రితమే హత్య చేసారని శవాన్ని వంటగది గోడలో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు.

ఆదోని : కర్నూలు జిల్ల ఆధోనిలో ఆటోను లారీ డీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు ఆధోని నుండి సూగురుకు వెల్తుండగా కుప్పగల్లు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఎమ్మేల్సీ అభ్యర్థి అనుమానాస్పద మృతి
ఏలూరు : ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజికవర్గ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఆవలదాసు దుర్గాప్రసాద్ అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్ : అదిలాబాద్,కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంట నష్టంపై ఆరా తీయడానికి బయలుదేరారు 

No comments:

Post a Comment