తెలుగుదేశం పార్టీ సమావేశం..
గుంటూరు : పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు తెనాలిలో పార్టీ మంత్రులతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ హయంలో కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, భారీ పంటనష్టంపై సీఎమ్ కిరణ్ కూమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.వివిధ జిల్లాలో అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని సమీక్షించాలని మంత్రులను ఆదేశించారు.
కేసీఆర్ ను ప్రశ్నించిన ఆయన సోదరుని కుమార్తె రమ్య
నిజామాబాద్ : స్థానికేతరులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇచ్చారని కేసీఅర్ అన్న రంగారావు కుమార్తె రేగులపాటి రమ్య ఆరోపించారు. స్వామిగౌడ్ స్థానికేతరుడని ఆమె తెలిపారి. కేసీఆర్,స్వామిగౌడ్ లు సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టారని ఆమె ఆరోపించారు. ఆమె భర్త మధుసుధన్ రావు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్,జిల్లాల పట్టభద్రుల నియోజికవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.అరసవల్లి ఆలయంలో తొక్కిసలాట..
శ్రీకాకుళం : అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రధసప్తమి వెడుకలు ఘనంగా నిర్వహించారు. సంధర్బంగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆలయ సిబ్బంది వీరికి సపర్యలు చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు, వడగండ్ల వానతో రైతులు ఎంతగానో నష్టపోయారని ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని తెరాస నేత హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు.
హైదరాబాద్ : నెక్లెస్ రోడ్ లో ఉత్సాహంగా హరిథాన్ పేరుతో పీ3పీ సంస్థ పరుగు నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన. ఈ కార్యక్రమాన్ని మంత్రి దానం నాగేందర్ ప్రారంభించారు.విధ్యార్ధులు, యువత ఈ పరుగులో పాల్గోన్నారు
No comments:
Post a Comment