రోడ్డు ప్రమాదాలు..
కరీంనగర్ : జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద స్కూల్ వ్యాన్, ద్విచక్ర వాహనం డీకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ఖమ్మం : చర్లమండలం గుంపెన గూడం వద్ద ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొని చర్ల ఎస్ బిహెచ్ మానేజర్, సహయ మేనేజర్ మరో వ్యక్తి ఈప్రమాదంలో గాయాల పాలయ్యారు.
చంద్రబాబు పాదయాత్ర తెనాలికి చేరుకుంది.
హైదరాబాద్ : సహకార ఎన్నికలకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని వినోద్ తెలిపారు. తెలంగాణ వాదం లేదనే వారు సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణలో జరుగుతున్న ఎమ్మేల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వినోద్ సవాల్ విసిరారు.
ఆదిలాబాద్ : అక్బరుద్దీన్ మొదట కోర్టుకు తన పాస్ పోర్ట్ ఇవ్వనందు వలన కోర్టు విడుదలను నిలిపివేసింది. తరువాత ఆయన న్యాయవాదులు పాస్ పోర్ట్ ను సమర్పించారు. అక్బరుద్దీన్ విడుదలకు నిర్మల్ యాన్సిఫ్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఘారాన మోసం...
- విశాఖ : విశాఖ జిల్లాలో బోర్డు తిప్పేసిన స్విమ్స్ ఫైనాన్స్ కంపెనీ,డిపాజిట్ దారుల అందోళన.
- డిపాజిట్ చేసీన డబ్బు తిరిగిరాదని సత్తిబాబు అనే డిపాజిట్ దారుడు రైలు కింద పడి అత్మహత్య చేసుకున్నాడు .
- ఇతను 6లక్షలు డిపాజిట్ చేసాడు.
వర్షాలు..వరదలు..
- హైదరాబాద్ లో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు.
- రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు.రాయలసీమా, తెలంగాణలో భారీ వర్షాలు
- కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.
- వర్షానికి అదిలాబాద్ జిల్లాలో చెట్టు కూలి ఇద్దరు మృతి. మార్కేట్ యార్డలో పత్తి బస్తాలు తడిచిపోయాయి.
- కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రైతులు పంటలు తీవ్రంగా నష్ట పోయారు.
-
జగ్గయ్యపేటలో వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం.
No comments:
Post a Comment