September 7, 2013

హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ లాయర్ల దాడి


 హైదరాబాద్: 
రాష్ట్ర హైకోర్టు రణరంగమైంది. న్యాయదేవత సాక్షిగా, పోలీసుల సాక్షిగా సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు న్యాయవాదులు గాయపడగా, వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా శుక్రవారం సీమాంధ్ర న్యాయవాదులు చేపట్టిన ‘మానవహారం’.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరణకు నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ‘చలో హైకోర్టు’ కార్యక్రమాలతో హైకోర్టు అట్టుడికింది. ఈ క్రమంలోనే మానవహారానికి సిద్ధమైన సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు న్యాయవాదులు (హైకోర్టుకు చెందిన వారు కాదు) చేయిచేసుకున్నారు. దీంతో హైకోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది

No comments:

Post a Comment