August 31, 2013

రూపాయి పతనం.. కరెంట్ ఖాతా లోటుతోనే : మన్మోహన్ సింగ్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రూపాయి పతనంపై పార్లమెంటులో వివరణ ఇచ్చారు. గురువారం పార్లమెంటులో రూపాయి పతనంపై విపక్షాలు ఆందోళన చేయగా.. శుక్రవారం నాడు తప్పకుండా సభలో వివరణ ఇస్తానని ఇచ్చిన హామిని ప్రధాని నిలబెట్టుకున్నారు. 


శుక్రవారం లోక్ సభ వాయిదా పడి పునఃప్రారంభం కాగా ప్రధాని దేశ ఆర్ధికస్థితిపై వివరణ ఇచ్చారు. మే 22 నుంచి రూపాయి పతనం ఆరంభమైందని తెలిపారు. సిరియా అంతర్యుద్ధం సహా అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా రూపాయిపై ఒత్తిడి పెంచాయని అన్నారు. దేశీయంగా కరెంటు ఖాతా లోటు కూడా రూపాయి బలహీనపడడానికి కారణమైందని అన్నారు.

దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడంతో దిగుమతుల భారం పెరిగిందని, దీంతో, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చయిపోయాయని, తద్వారా రూపాయి చారిత్రక కనిష్టస్థాయిని తాకిందని చెప్పారు. ఇక దేశ ప్రజలకు బంగారం కొనుగోళ్ళను తగ్గించుకోవాలని సూచించారు. 

పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో పొదుపు పాటించాలని సలహా ఇచ్చారు. కుదేలైన ఆర్ధికస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని ప్రధాని తెలిపారు. కరెంటు ఖాతా లోటు నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

No comments:

Post a Comment