August 30, 2013

జగన్ దీక్ష విరమించాలి : కొణతాల - పొత్తూరి వినతి


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణం దీక్ష విరమించాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో పాటు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. జగన్ ఆరోగ్యం పట్ల తమతో పాటు... ఈ రాష్ట్ర ప్రజలకు ఆందోళనగా ఉందన్నారు. అందువల్ల ఆయన తక్షణం రాజీనామా చేయాలని కోరారు. 

ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఐదు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నందున జగన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని అందువల్ల ఆయన తక్షణం దీక్ష విరమించాలన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం దీక్ష విరమించాలని కోరుతున్నట్లు పార్టీ చెప్పారు. 

జగన్ ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. జగన్ దీక్ష విరమించాలని ఆయన తల్లి విజయమ్మ కూడా కోరారు. కాంగ్రెస్ మొండి వైఖరిపై పోరాడాలని, అదేసమయంలో ఆరోగ్యం కూడా అవసరమని ఆమె అన్నారు. 

అంతేకాకుండా, ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం అత్యంవసరంగా సమావేశమైంది. ఆరోగ్యం బాగా క్షీణించినందున జగన్ తో దీక్ష విరమింపజేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన వైఎస్ జగన్ కు లేఖ రాశారు. వైఎస్ జగన్ ను అభిమానించే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

దీక్ష ద్వారా జగన్ ఆరోగ్యం దెబ్బ తింటే అభిమానులు తీవ్రంగా కలత చెందుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చిన పలు వార్తా కథనాలు చదివినట్లు ఆయన తెలిపారు. 

ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరించినట్లు ఆ వార్త కథనాల ద్వారా తెలుసుకునీ ఆవేదన కలిగిందని పొత్తూరి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా జగన్ కు రాసిన లేఖలో వివరించారు. అందువల్ల తక్షణం దీక్షను విరమించాలని పొత్తూరి తన లేఖలో కోరారు.

No comments:

Post a Comment