August 30, 2013

ఛాంపియన్స్ లీగ్: హైదరాబాద్ జట్టుకు సంగక్కర దూరం





ఛాంపియన్స్ లీగ్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటం లేదు. తమ దేశవాళీ జట్టు కుందురత తరఫున అతను బరిలోకి దిగుతున్నాడు. 
లంక ప్రీమియర్ లీగ్ రద్దు కావడంతో సూపర్ 4 లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కుందురత జట్టు చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. దీంతో తమ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తానని సంగక్కర స్పష్టం చేశాడు. లంక బోర్డు కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నాడు. ఐపీఎల్-6లో సన్‌రైజర్స్‌కు ఆడిన ఈ లంక మాజీ కెప్టెన్‌ను చాలా మ్యాచ్‌ల్లో పక్కనబెట్టారు. అయితే విండీస్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌తో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను గాడిలో పడ్డాడు.



No comments:

Post a Comment